బాలయ్య సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యేనా?

balayya 102 film title jaisimha fix

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Balayya 102 Film Title Jaisimha Fix

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 101వ చిత్రం ‘పైసా వసూల్‌’ను ముగించే పనిలో ఉన్నాడు. పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాకు సంబంధించి చివరి షెడ్యూల్‌ తమిళనాడులో జరుపుకుంటుంది. ఆ సినిమా చిత్రీకరణ ఈ నెల చివరితో పూర్తి కానుంది. సెప్టెంబర్‌లో దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ‘పైసా వసూల్‌’ చిత్రం విడుదల కాకుండానే బాలయ్య తన 102వ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేయబోతున్నాడు. 

వచ్చే నెల నుండి బాలకృష్ణ 102వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రంకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ దాదాపుగా అంతా పూర్తి అయ్యింది. తమిళ దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో బాలయ్య 102వ చిత్రాన్ని సి కళ్యాణ్‌ నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి బాలయ్య ‘జయసింహా’ అనే టైటిల్‌ను పెట్టాల్సిందిగా దర్శక నిర్మాతలకు సూచించినట్లుగా తెలుస్తోంది. గతంలో బాలయ్య నటించి సక్సెస్‌ అయిన పలు సినిమాల టైటిల్స్‌లో సింహా పదం ఉంది. సమరసింహా రెడ్డి, నరసింహానాయుడు, సీమసింహం, లక్ష్మినరసింహా, సింహా ఇలా సింహా పదాలతో ఉన్న చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో పాటు బాలయ్య క్రేజ్‌ను అమాంతం పెంచేశాయి. అందుకే బాలయ్య తన 102వ సినిమాకు ‘జయసింహా’ అనే టైటిల్‌ను ఖరారు చేయించడం జరిగింది. మరి సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయ్యి బాలయ్య 102వ సినిమా సక్సెస్‌ అయ్యేనో చూడాలి.

మరిన్ని వార్తలు