ప్లీజ్‌.. ఇక విసిగించకండి

actor pawan kalyan ex wife renu desai gives clarity about her relation

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Actor  Pawan Kalyan Ex Wife Renu Desai Gives Clarity About Her Relation With Power Star

పవన్‌ కళ్యాణ్‌, రేణుదేశాయ్‌ సుదీర్ఘ కాలం పాటు సహజీవనం చేసి, కొడుకు పుట్టిన తర్వాత వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఇద్దరు పిల్లలు అయిన తర్వాత వీరిద్దరు కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకోవడం జరిగింది. విడాకుల తర్వాత కూడా పిల్లల కోసం ఇద్దరు సందర్బానుసారంగా కలుస్తూనే ఉన్నారు. అయితే వీరిద్దరు మళ్లీ కలిస్తే చూడాలని ఫ్యాన్స్‌ ఎక్కువ శాతం మంది కోరుకుంటున్నారు. ప్రస్తుతం పవన్‌ మూడవ భార్య అన్నా లెజ్నెవాతో కలిసి ఉంటున్నా కూడా ఫ్యాన్స్‌ మాత్రం మళ్లీ రేణుదేశాయ్‌ను చేరదీస్తే బాగుండు అనుకుంటున్నారు. 

అదే విషయాన్ని రేణుదేశాయ్‌తో పదే పదే పవన్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో అంటూ వస్తున్నారు. రేణు దేశాయ్‌ పెట్టిన ప్రతి పోస్ట్‌కు కామెంట్స్‌ రూపంలో మీరు పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ కలవాలని, అన్నయ్య మీరు మళ్లీ ఒక్కటి కావాలంటూ తమ కోరిక అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. దాంతో విసిగి పోయిన రేణు దేశాయ్‌ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఒక పోస్ట్‌ చేసింది. అందులో పవన్‌తో ఇక జీవితంలో కలవడం అసాధ్యం. ఆయన జీవితం, నా జీవితం వేరు. మేమిద్దరం కలవాలని కోరుకోవడం అర్థం లేనిది అంటూ ట్వీట్‌ చేసింది. దయచేసి ఇకపై అలాంటి కామెంట్స్‌ చేయవద్దని, పవన్‌తో నేను కలిసి జీవించడం సాధ్యం అయ్యే పని కాదు అంటూ తేల్చి చెప్పింది. అయినా కూడా ఫ్యాన్స్‌ ఇక్కడితో ఆగుతారనే నమ్మకం లేదు. పవన్‌ ఫ్యాన్స్‌ ఏ విషయాన్ని అంత సులభంగా వదలరని గతంలో పలు సందర్బాల్లో రుజువు అయ్యింది. మళ్లీ మళ్లీ రేణుదేశాయ్‌కు ఈ కామెంట్స్‌ తప్పవు.

 మరిన్ని వార్తలు