శిరీష కేసులో భర్త ప్రశ్నకు సమాధానమేంటి..?

Her Husband Sensational Comments About Beautician Sirisha Death

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Her Husband Sensational Comments About Beautician Sirisha Death

బ్యూటీషియన్ శిరీష కేసులో అనుమానాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అసలు చంపిందెవరు.. ఎలా చనిపోయింది అనే మాటలకు ఆత్మహత్యతో పోలీసులు తెరదించినా.. ఇంకా ఎన్నో సందేహాలు ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా శిరీష భర్త కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తనకు అర్థరాత్రి లొకేషన్ షేర్ చేసిన తర్వాత శిరీష బతికే ఉందని నిరూపించే ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారాయన.

నిజానికి శిరీష కేసులో పోలీసులు విచారించిన తీరు కూడా అనుమానాస్పదంగానే ఉంది. రాజీవ్, శ్రవణ్ లను కుకునూరుపల్లె వరకు తీసుకెళ్లిన పోలీసులు.. క్రైమ్ సీన్ రీకన్ స్ట్రక్ట్ చేశారు. కానీ కీలకమైన పోలీస్ క్వార్టర్స్ లోకి వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసును పక్కదోవ పట్టించారనడానికి అదే నిదర్శనం అంటున్నారు శిరీష భర్త.
శిరీషను కుకునూరుపల్లెలోనే చంపేసి ఉంటారని, తర్వాత ఆమె శవాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారని ఆయన చెబుతున్నారు. పోలీసులు సరైన సాక్ష్యాలు చూపలేకపోతున్నారని, ఒకేసారి అటు ఆర్జే స్టూడియోలో, ఇటు కుకునూరుపల్లె పోలీస్ క్వార్టర్స్ లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వెనుక మర్మమేంటని శిరీష భర్త ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద శిరీష కేసు పెద్ద మిస్టరీ అంటున్నారు ఆమె కుటుంబసభ్యులు.

మరిన్ని వార్తలు:

గరగపర్రు వివాదంలో కొత్త కోణం.

ఐఏఎస్ తో ఎమ్మెల్యే పెళ్లి