కలిసింది వాస్తవమే, కాని..!

Prabhu Deva Directing Prabhas Next Movie Is Fake News

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Prabhu Deva Directing Prabhas Next Movie  Is Fake News

‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్‌ చేస్తున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ ముంబయిలో జరుగుతుంది. ఈ సమయంలోనే ప్రభాస్‌తో పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు భేటీ అవుతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇటీవలే కరణ్‌ జోహార్‌ ఇచ్చిన ఒక పార్టీకి ప్రభాస్‌ వెళ్లాడు. అక్కడే షూటింగ్‌లో ఉన్న కారణంగా కరణ్‌ జోహార్‌ పిలిచిన వెంటనే వెళ్లడం జరిగింది. ఆ సమయంలో ప్రభాస్‌తో రెండు సినిమాల ఒప్పందం చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఇంకా వస్తూనే ఉన్నాయి తాజాగా ‘సాహో’ సెట్స్‌లో ప్రభాస్‌ను ప్రభుదేవా కలిశాడు, ఇద్దరు సినిమా చేయబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. 

ప్రభుదేవా ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌. ఈ స్టార్‌ డైరెక్టర్‌గా ప్రభాస్‌తో బాలీవుడ్‌లో ఒక సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని, తాజాగా ప్రభాస్‌ను కలిసిన సమయంలో అదే విషయాన్ని చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి. ప్రభుదేవా, ప్రభాస్‌ల కాంబినేషన్‌లో సినిమా ఖాయం అంటూ వార్తలు అప్పుడే జోరుగా వస్తున్నాయి. ఈ వార్తలపై ప్రభాస్‌ సన్నిహితులు స్పందించారు. తాజాగా ప్రభాస్‌ను ప్రభుదేవా కలిసిన మాట వాస్తవమే. కాని ప్రత్యేక కారణం ఏమీ లేదని, ముంబయిలో షూటింగ్‌ జరుపుకుంటుండగా, అటుగా వచ్చిన ప్రభాస్‌ కలిశాడు తప్ప, అంతకు మించిన కారణం లేదు అంటూ తేల్చి పారేస్తున్నారు. ‘సాహో’ పూర్తి అయ్యే వరకు ప్రభాస్‌ మరో సినిమా గురించి ఆలోచన చేయడని కూడా వారు అంటున్నారు.

మరిన్ని వార్తలు:

అనుష్కలా తప్పు చేయనంది!

ప్లీజ్‌.. ఇక విసిగించకండి