రామాయణంపై పడ్డ వర్మ

RGV Want To Direct Short Film On Ramayana Story

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

RGV Want To Direct Short Film On Ramayana Story

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఇది అది అని కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని టచ్‌ చేయడం, ప్రతి అంశాన్ని తనదైన శైలిలో విమర్శించడం, ప్రతి వివాదాన్ని తనదైన శైలిలో విశ్లేషించి దాన్ని తనదైన అర్థం ఇవ్వడం జరుగుతుంది. ఇటీవలే ఈయన యూట్యూబ్‌ సిరీస్‌పై దృష్టి పెట్టాడు. ఈయన మొదటగా ‘మేరీ బేటీ సన్నీలియోన్‌ బన్‌ చహతాహై’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను తెరకెక్కించడం జరిగింది. ఆ షార్ట్‌ ఫిల్మ్‌ సంచలనం సృష్టించింది. ఒక కూతురు తన తల్లి తండ్రికి తానో సన్నీలియోన్‌లా అంటే పోర్న్‌ స్టార్‌లా మారాలని భావిస్తున్నట్లుగా చెబుతుంది. ఆ షార్ట్‌ ఫిల్మ్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. దాంతో ఇప్పుడు మరో షార్ట్‌ ఫిల్మ్‌కు వర్మ సిద్దం అయ్యాడు. అయితే ఈసారి అత్యంత వివాదాస్పద అంశంను వర్మ టచ్‌ చేయబోతున్నాడు.

రామాయణంలోని రాముడు అడవికి వెళ్లబోయే ముందు సీన్‌తో షార్ట్‌ ఫిల్మ్‌ను తీయాలని భావిస్తున్నాడు. రాముడిని అడవికి పంపించాలని కైకేయి దశరథ మహారాజును అడుగుతుంది. ఆ సమయంలో దశరథుడు ఎలా ఫీల్‌ అయ్యాడు అనే విషయాలు మాత్రమే మనం ఇప్పటి వరకు చూశాం. కాని వర్మ కాస్త కొత్తగా ఆలోచించాడు. రాముడిని అడవులకు పంపాలని కైకేయి రాత్రి సమయంలో దశరధుడిని అడుగుతుంది. ఆ రాత్రి కైకేయి, దశరథ రాజుల మద్య అసలేం జరిగింది? అనే కాన్సెప్ట్‌తో వర్మ తనదైన శైలి మసాలా దట్టించి షార్ట్‌ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఇదే కాన్సెప్ట్‌తో సినిమా తీస్తే ఖచ్చితంగా సెన్సార్‌ రాదు. అందుకే షార్ట్‌ ఫిల్మ్‌ను వర్మ తీస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు:

బిక్షమెత్తుతున్న కమెడియన్‌కు ఛాన్స్‌లు

మహేష్‌కు బావ వల్ల ఎంత కష్టమొచ్చింది