అసెంబ్లీ కి ఉండవల్లి.

undavalli arun kumar visit amaravati assembly

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యక్ష రాజకీయాలకు దూరం దూరం అంటూనే దగ్గరదగ్గరకి వస్తున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నిస్తానే తప్ప, వైసీపీ లో చేరే ఉద్దేశం లేదని చెబుతున్న ఉండవల్లి నేడు హఠాత్తుగా అమరావతి తాత్కాలిక అసెంబ్లీ లో ప్రత్యక్షం కావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు, కొలనుకొండ శివాజీలతో కలిసి ఆయన అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చారు. అసెంబ్లీ లాబీ లో కలియదిరిగిన ఉండవల్లి వివిధ ఛాంబర్లని కూడా ఆసక్తిగా చూసారు. ఇటీవల వర్షపు నీరు కురిసి వివాదం రేగిన ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ ని కూడా ఉండవల్లి పరిశీలించారు. ఓ రాజకీయనాయకుడు అసెంబ్లీ ప్రాంగణంలోకి రావడం లో విశేషం ఏమీ లేకపోయినా ఉండవల్లి గురించి తెలిసిన కొందరు మాత్రం ఊరక రారు మహానుభావులు అంటూ త్వరలో ఈయన ఏదో ఒకటి లేవనెత్తుతాడని అంటున్నారు. అయితే ఉండవల్లి తో పాటు ఉంటున్న మల్లాది విష్ణు వైసీపీ లో చేరడానికి రెడీ అయిపోయినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉండవల్లి అమరావతి టూర్ పొలిటికల్ సర్కిల్స్ లో ఇంటరెస్ట్ కలిగిస్తోంది.

‘అసెంబ్లీ బాగుందంటే టీడీపీలోకి వెళ్తున్నాననంటారు.. అంసెబ్లీ బాగలేదంటే వైసీపీలో చేరుతున్నానంటారు’ అని అసెంబ్లీ ఎలా ఉందని ప్రశ్నించిన విలేకరికి సమాధానమిచ్చారు.అసెంబ్లీని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ఈ విషయాన్ని మల్లాది విష్ణుకు చెబితే ఆయన ఈ రోజు బాగుందని చెప్పి వెళ్దామంటే వచ్చానని ఉండవల్లి చెప్పారు. అసెంబ్లీ నిర్మాణం బాగుందని, వర్షపు నీరు వచ్చినంత మాత్రాన వివాదం చెయ్యాల్సిన అవసరం లేదని అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేనని, 2019 ఎన్నికల్లో పోటీచేయనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తనకు టీడీపీలోనూ, వైసీపీలోనూ తెలిసినవాళ్లు ఎవరూ లేరని అందుకే మల్లాది విష్ణుతో కలిసి వచ్చానని ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.

 మరిన్ని వార్తలు 

శ్రీవారి నిర్ణయాన్ని చంద్రబాబు కాదన్నారా?

తొలి ఏకాదశి – విశిష్టత

వైసీపీ లోకి మల్లాది విష్ణు?