వైసీపీ లోకి మల్లాది విష్ణు?

malladi vishnu joins in ysrcp party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బెజవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మల్లాది విష్ణు వైసీపీ లో చేరబోతున్నట్టు విశ్వసనీయ సమాచారం. జగన్ సమక్షంలో ఇందుకు సంబంధించిన కార్యక్రమం ఉండొచ్చని కూడా తెలుస్తోంది. ఒకప్పుడు వంగవీటి రంగా అనుచరుడిగా బెజవాడ రాజకీయాల్లో ఎదిగిన రంగా తరువాత కాలంలో కేవీపీ, వై.ఎస్ కి కూడా బాగా సన్నిహితంగా మెలిగారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ లో మెజారిటీ నేతలు వైసీపీ లేదా టీడీపీ లో చేరిపోయారు. కానీ మల్లాది విష్ణు మాత్రం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఆయనకి సంబంధించిన ఓ బార్ లో కల్తీ మద్యం కేసు వచ్చినప్పుడు కూడా ఎంత ఒత్తిడి వచ్చినా మల్లాది ఏ పార్టీ లోకి వెళ్ళేది లేదని చెప్పారు. తాజాగా ఆయన నిర్ణయం మార్చుకుని వైసీపీ లో చేరాలి అనుకోవడం వెనుక ఇక కాంగ్రెస్ కి భవిష్యత్ లేదని అర్ధం కావడంతో పాటు ఆయన గురువులా భావించే కేవీపీ సలహా కూడా ఉన్నట్టు విజయవాడ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

కాంగ్రెస్ కి వీరాభిమాని అయిన విష్ణు పార్టీ మారతాడని ఆయన అనుచరులే అనుకోలేదు. అయితే విష్ణు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఒకప్పటి వై.ఎస్ కోటరీ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కోటరీ ఇటీవల కేవీపీ ఆధ్వర్యంలో ఓ రహస్య సమావేశం నిర్వహించుకుని జగన్ కి అండగా వుండాలని నిర్ణయం తీసుకుందట. పైగా కాంగ్రెస్ లో ఇంకా మిగిలివున్న వై.ఎస్ కోటరీ సభ్యుల్ని జగన్ గొడుగు కిందకి చేర్చే పనిని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కి అప్పగించినట్టు తెలుస్తోంది. అలా అరుణ్ కుమార్ చొరవతో ఇప్పుడు మల్లాది విష్ణు జగన్ గూటికి చేరుకుంటున్నట్టు తెలుస్తోంది.

 మరిన్ని వార్తలు 

ఫోటోలో నుంచి అటూఇటూ తిరిగిచూస్తున్న సాయిబాబా. వైరల్ వీడియో