మహేష్‌కు బావ వల్ల ఎంత కష్టమొచ్చింది

mahesh babu twitte about sudeer babu samanthakamani movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన సినిమాల విషయంలో తప్ప మరే ఇతర సినిమాల గురించి పట్టించుకోడు. కాని తన బావ సుధీర్‌ బాబు నటించిన ప్రతి సినిమా గురించి ఇటీవల మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. సోదరి భర్త అయిన కారణంగా సుధీర్‌ బాబును టాలీవుడ్‌లో నిలిపేందుకు మహేష్‌బాబు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే సుధీర్‌ బాబు చేసే ప్రతి సినిమాను మహేష్‌బాబు సపోర్ట్‌ చేస్తూ వస్తున్నాడు. తాజాగా సుధీర్‌ బాబు ‘శమంతకమణి’ చిత్రంలో నటించాడు. ఆ సినిమా ప్రమోషన్‌ బాధ్యత అంతా కూడా మహేష్‌బాబు తనపై వేసుకున్నాడు. 

సినిమా ఫస్ట్‌లుక్‌ను స్వయంగా మహేష్‌బాబు తన ట్విట్టర్‌ పేజీలో పోస్ట్‌ చేసి బాగుందని కామెంట్‌ చేశాడు. ఆ తర్వాత టీజర్‌ను పోస్ట్‌ చేసి ఆసక్తికరంగా ఉందన్నాడు. తాజాగా ట్రైలర్‌ను కూడా చాలా బాగుందంటూ పోస్ట్‌ చేశాడు. ట్రైలర్‌ చాలా స్టైలిష్‌గా ఉందని, ఇటీవల ఇలాంటిది చూడలేదంటూ పోస్ట్‌ చేసి సినిమాపై అందరిలో ఆసక్తిని రేకెత్తించాడు. మొత్తానికి బావ సినిమా కోసం మహేష్‌బాబు చాలానే కష్టపడుతున్నట్లుగా అనిపిస్తుంది. తన పని ఏదో తాను చూసుకు వెళ్లే మహేష్‌బాబు ఇలా సుధీర్‌బాబు కోసం మాత్రమే ట్వీట్‌ చేస్తూ ఉంటాడు. చాలా అరుదుగా మహేష్‌బాబు చేస్తున్న ట్వీట్స్‌ కనుక అంతా కూడా శమంతకమణిపై ఆసక్తిని పెంచుకున్నారు. త్వరలో ఆ చిత్రం విడుదల కాబోతుంది. సుధీర్‌బాబుతో పాటు ఆ సినిమాలో నారా రోహిత్‌, సందీప్‌ కిషన్‌, ఆదిలు కూడా నటించారు. ఒక బిగ్‌ మల్టీస్టారర్‌గా ఆ సినిమా తెరకెక్కింది.

మరిన్ని వార్తలు