సైమా 2016 టాలీవుడ్‌ విజేతలు వీరే

SIIMA 2016 Telugu winners list

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

SIIMA Awards 2016 Telugu winners list

గత కొన్ని రోజులుగా అవార్డుల జాతర జరుగుతుంది. రెండు నెలలుగా పలు అవార్డు వేడుకలు జరగడం సినిమా తారలు సందడి చేయడం జరుగుతూ ఉంది. తాజాగా సౌత్‌ ఇండియా సినీ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా తీసుకునే సైమా అవార్డుల వేడుక దుబాయ్‌లో వైభవంగా జరుగుతుంది. సౌత్‌ ఇండియన్‌ సినీ పరిశ్రమలకు చెందిన సెలబ్రెటీు దాదాపు అంతా కూడా దుబాయిలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం పలు అవార్డులు అందుకున్న ఎన్టీఆర్‌ మరోసారి సైమా అవార్డును అందుకున్నాడు. నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌ చిత్రాలకు గాను స్టార్‌ మా, ఐఫా, శంకరాభరణం అవార్డులను అందుకున్న ఎన్టీఆర్‌ ‘జనతాగ్యారేజ్‌’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు. ఇక ఉత్తమ హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందుకుంది. ‘పెళ్లి చూపులు’ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ నటుడు (క్రిటిక్‌) అవార్డును జెంటిల్‌మన్‌కు గాను నాని దక్కించుకున్నాడు.

సైమా 2016 తెలుగు విజేత జాబిత :
ఉత్త‌మ చిత్రం – పెళ్ళి చూపులు
ఉత్త‌మ న‌టుడు – ఎన్టీఆర్ (జ‌న‌తాగ్యారేజ్‌)
ఉత్త‌మ న‌టి – ర‌కుల్ ప్రీత్ సింగ్‌(నాన్న‌కు ప్రేమ‌తో)
ఉత్త‌మ న‌టుడు(క్రిటిక్‌) – నాని(జెంటిల్ మన్‌)
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు – త‌రుణ్ భాస్క‌ర్(పెళ్ళి చూపులు)
ఉత్త‌మ తొలి చిత్ర హీరో – రోష‌న్ (నిర్మ‌ల కాన్వెంట్‌)
ఉత్త‌మ తొలి చిత్ర హీరోయిన్ – నివేద థామ‌స్ (జెంటిల్ మ‌న్‌)
ఉత్త‌మ స‌హాయ‌క పాత్ర – శ్రీకాంత్‌(స‌రైనోడు)
ఉత్త‌మ స‌హాయ న‌టి- అన‌సూయ‌(క్ష‌ణం)
ఉత్త‌మ హాస్య న‌టుడు – ప్రియ‌ద‌ర్శి(పెళ్ళి చూపులు)
ఉత్త‌మ ప్ర‌తి నాయ‌కుడు – జ‌గ‌ప‌తిబాబు(నాన్న‌కు ప్రేమ‌తో)
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు – దేవిశ్రీ ప్ర‌సాద్ (జ‌న‌తాగ్యారేజ్‌)
జీవిత సాఫ‌ల్య పుర‌స్కారం – ముర‌ళీ మోహ‌న్‌

మరిన్ని వార్తలు:

బన్నీ, బాలయ్యలను చూసి నేర్చుకోండయ్యా

నాకు తెలుసు.. మీరు మూసుకోండి!