‘బలగం’ వేణు తర్వాత దర్శకుడిగా మారబోతున్న మరో కమెడియన్….

'బలగం' వేణు తర్వాత దర్శకుడిగా మారబోతున్న మరో కమెడియన్....
Latest News

జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన వేణు ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు . వేణు తెరకెక్కించిన బలగం సినిమా సృష్టించిన సంచలనం అలాంటిది. తెలంగాణ గ్రామీణ భావోద్వేగాల ను ఎంతో అద్భుతంగా తెరక్కించిన వేణు.. బలగం సినిమా తో భారీ విజయం అందుకున్నాడు. ప్రస్తుతం బలగం సినిమా అంతర్జాతీయంగా అనేక అవార్డులు సొంతం చేసుకుంటుంది .

'బలగం' వేణు తర్వాత దర్శకుడిగా మారబోతున్న మరో కమెడియన్....
Jabardasth Dhanaraj

ఇదిలా ఉండగా జబర్దస్త్ తో కెరీర్ ప్రారంభించిన మరో కమెడియన్ దర్శకుడిగా మారబోతున్నట్లు తెలుస్తుంది . కమెడియన్ గా టాలీవుడ్ లో రాణిస్తున్న ధనరాజ్ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ధనరాజ్ విలేజ్ నేపథ్యం లో సాగే ఎమోషనల్ కథని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రాన్ని దసరా రోజు ప్రారంభించనున్నారంట .