సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

KTR's interesting comments on CM KCR's health..
KTR's interesting comments on CM KCR's health..

సీఎం కేసీఆర్ జబర్దస్త్ గా ఉన్నాడు.. మనకోసం లోపల కూర్చొని అన్ని చేస్తున్నాడు.. త్వరలో బయటికి వచ్చి అన్ని ప్రకటనలు చేస్తారు.. సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్లలో చేసిన పనులు మీ కళ్ల ముందున్నాయి.. ఒక్క ఛాన్స్ ఇవ్వండని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో అడగండి.. కాంగ్రెస్ అధికారం వస్తే మళ్లీ కష్టాలు వస్తాయి అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్‌.

మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ భూపాలపల్లి లో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యాక్రమంలో ఎమ్మె్ల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తర్వాత డబుల్‌ బెడ్రూం ఇండ్లతోపాటు గృహలక్ష్మి, దళితబంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. సుభాష్‌కాలనీ పక్కనే గల మినీ స్టేడియంలో భారీ బహిరంగసభలో పాల్గొంటారు. పరకాలలో మున్సిపాలిటీ, తహసీల్దార్‌‌, ఆర్డీవో కార్యాలయ భవనాలను ప్రారంభిస్తారు.