చాలా ఏళ్ళ తరువాత రీ ఎంట్రీ కి “మన్మధుడు” హీరోయిన్?

"Manmadhudu" heroine for re-entry after many years?

మన్మధుడు మూవీ తో అందరికీ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయారు అన్షు. ఈ మూవీ తెలుగు సినీ అభిమానులకి ఎంతో ఫేవరేట్. ఇటీవల ఈ మూవీ ను రీ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అన్షు ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన రాఘవేంద్ర మూవీ లో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయినట్లు తెలుస్తుంది .

"Manmadhudu" heroine for re-entry after many years?
“Manmadhudu” heroine for re-entry after many years?

సందీప్ కిషన్ హీరోగా, డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న SK30 మూవీ లో ఒక కీలక పాత్ర కోసం అన్షు ని తీసుకోనున్నట్లు లేటెస్ట్ సమాచారం. తన పాత్రకు సంబందించిన నేరేషన్ పూర్తి అయ్యింది అని, అన్నీ కుదిరితే ఈ మూవీ తో రీ ఎంట్రీ కన్ఫర్మ్ అని చెప్పాలి. ఈ మూవీ లో హీరోయిన్ ఎవరనే దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది . సందీప్ కిషన్ టాలీవుడ్ లో వరుస మూవీ లతో బిజీగా ఉన్నారు. ఊరు పేరు భైరవకోన మూవీ లో చివరిసారిగా కనిపించారు. ఈ మూవీ ప్రేక్షకులని అలరించింది.