బాలయ్యతో ఇంకో సారి ఈ స్టార్ హీరోయిన్….!

This star heroine again with Balayya....!
This star heroine again with Balayya....!

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కోసం అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాలయ్య కెరీర్ లో 109వ మూవీ గా (NBK 109) తెరకెక్కిస్తుండగా ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ కూడా చాలానే పూర్తయ్యింది.

అయితే ఈ అన్నిటిలో అసలు బాలయ్య సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది సస్పెన్స్ గా మారింది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) ఈ మూవీ లో ఒక పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టుగా ఆమెనే తెలిపింది కానీ ఆమె హీరోయిన్ గా కాకుండా ముఖ్య పాత్రలో కనిపిస్తుంది అని టాక్ ఉంది . అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ పేరు ఇప్పుడు వినిపిస్తుంది.

This star heroine again with Balayya....!
This star heroine again with Balayya….!

లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ నటిస్తుంది అని వినిపిస్తుంది. గతంలో ఆల్రెడీ “భగవంత్ కేసరి” లో బాలయ్య సరసన కాజల్ నటించిన సంగతి అందరికి తెలిసిందే. దీనితో రెండో సారి ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని నయా రూమర్స్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే కాజల్ హీరోయిన్ పాత్రలా కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉండేలా కనిపిస్తుంది అని అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అనేది వేచి చూడాలి.