జబర్దస్త్ కి రష్మీ గుడ్ బై..? కారణం ఏంటీ !

జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సినిమాలలో కూడా నటించే అవకాశాన్ని అందుకుంది. సినిమాల్లోనే కాకుండా పలు షోలలో కూడా యాంకరింగ్ చేస్తూ ఎంతోమంది ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇక సుధీర్ తో లవ్ ట్రాక్, డ్యాన్స్ తో ఎంతోమంది ప్రేక్షకులకు రష్మి చేరువైంది. ఇక రష్మీ యాంకర్ అనసూయ తప్పుకున్నప్పటి నుంచి జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తూ వస్తోంది. ఈ మధ్యకాలంలో రష్మీ ప్లేస్ లో యాంకర్ సౌమ్య కూడా జబర్దస్త్ కు వచ్చింది. ఇక మల్లెమాలా సంస్థ రష్మికి చాలా తక్కువ పారితోషికం ఇస్తున్నారట. ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన సౌమ్యకి రష్మి కన్నా చాలా ఎక్కువ పారితోషికం ఇవ్వడంతో రష్మీ కాస్త ఫీల్ అయ్యారట.

జబర్దస్త్ కి రష్మీ గుడ్ బై..? కారణం ఏంటీ ! - Telugu Bullet

దీంతో జబర్దస్త్ షో నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని రష్మీ ఫిక్స్ అయ్యిందట. అగ్రిమెంట్ ప్రకారం రష్మి ఈ షో నుంచి తప్పకుంటున్నట్లు అందరికీ చెప్పేసిందట. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలిసి చాలా చానల్స్ వారు రష్మిని వారీ షోలలో భాగం చేసుకోవాలని భావించినప్పటికీ రష్మీ చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటుందట. ఈ విషయం తెలిసిన చాలా మంది ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.