జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాక… ఈ కమెడియన్ల పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా..?

జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాక… ఈ కమెడియన్ల పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా..?
Latest News

జబర్దస్త్ చాలా మందికి మంచి లైఫ్ ని ఇచ్చింది చాలామంది జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యారు. జబర్దస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన కొందరు ఇప్పుడు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నారు. కొంత మంది మాత్రం అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. హైపర్ ఆది, సుడిగాలి సుదీర్, చమ్మక్ చంద్ర వంటి వాళ్ళు జబర్దస్త్ నుండి బయటికి వచ్చి చాలా రోజులు అయిపోయింది . సుధీర్ ఇప్పటికే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాక… ఈ కమెడియన్ల పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా..?
Avinash

అప్పారావు వంటి వాళ్లు మాత్రం బయట ఎక్కడా పెద్దగా కనిపించట్లేదు. కొంతమంది మాత్రం అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లో కనపడుతున్నారు. కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారి బలగం సినిమాతో హిట్టు కొట్టారు. అవినాష్ కి మాత్రం పెద్దగా అవకాశాలు లేక చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాడు. మల్లెమాల మాత్రం స్ట్రిక్ట్ రూల్స్ ని పెడుతుంది అగ్రిమెంట్ ని ఎవరైనా బ్రేక్ చేస్తే పది లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. బిగ్ బాస్ కోసం ముక్కు అవినాష్ అగ్రిమెంట్ ని బ్రేక్ చేసి ఏకంగా 10 లక్షల రూపాయలు కట్టాడట.