బలగం వేణు లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా ..?

బలగం వేణు లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా ..?
Cinema News

జబర్దస్త్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. తర్వాత బలగం మూవీ కి దర్శకత్వం వహించి తనలో ఒక మంచి దర్శకుడు ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నారు. పాతికేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి కమెడియన్ గా వేణు వచ్చాడు. పలు మూవీ ల్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు ఒక్కో మూవీ తో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ తర్వాత నెమ్మదిగా జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యాడు అయితే తెలంగాణ నేటివిటీతో మూవీ తీయడం వలన ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు.

బలగం వేణు లో ఈ ట్యాలెంట్ కూడా ఉందా ..?
Balagam Movie Venu

ఇప్పుడు నాచురల్ స్టార్ నానితో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు మూవీ ల్లోకి రాకముందు తను ఏం చేశాడో చెప్పాడు. వేణు తల్లి తండ్రులు కూరగాయల వ్యాపారం చేస్తే తాను కూడా చిన్నప్పటినుండి కూరగాయలు అమ్మేవాడట కొంచెం స్పెషల్ గా ఉండాలని మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నట్లు వేణు చెప్పాడు. మార్షల్ ఆర్ట్స్ లో రెండు సార్లు స్టేట్ చాంపియన్ గా గెలిచాదంట చిన్నప్పటినుండి అందరూ తనని బాబు మోహన్ కి చుట్టంలా ఉన్నావని అనేవారట కమెడియన్ గా ఉన్నావని అంతా చెప్పడంతో మూవీ లు మీద ఆసక్తి పెరిగే మూవీ ల్లోకి వచ్చినట్లు వేణు చెప్పాడు