TG Politics: కాంగ్రెస్ పార్టీలో చేరిన BRS పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత

TG Politics: BRS Peddapally MP Venkatesh who joined the Congress party is the leader
TG Politics: BRS Peddapally MP Venkatesh who joined the Congress party is the leader

పార్లమెంట్ ఎన్నికలకు ముందు BRS పార్టీకి బిగ్‌ షాక్ తగిలింది. కాంగ్రెస్‌ గూటికి ఎంపీ వెంకటేష్ నేత వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత చేరారు. ఈ మేరకు ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత కేసీ వేణుగోపాల్ నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డితో పాటు BRS ఎంపీ వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్‌ అగ్రనేత కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత చేరారు. కాగా వెంకటేష్ నేత.. పెద్దపల్లి ఎంపీగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈసారి పెద్దపల్లి ఎంపీ బీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ బాల్క సుమన్‌ కు ఇస్తారని వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే… కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత చేరారు.