ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో “సరిపోదా శనివారం” టీజర్!

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో “సరిపోదా శనివారం” టీజర్!
Cinema News

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం. ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. శనివారం (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు సందర్భంగా 1:25 నిమిషాల నిడివి గల టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కోపాలు రకరకాలు, ఒక్కొక్క మనిషి కోపం, ఒక్కొక్కలా ఉంటుంది. కానీ, ఆ కోపాన్ని క్రమబద్దంగా, పద్ధతిగా వారం లో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చి నాకొడుకుని ఎవరైనా చూసారా? నేను చూసాను అని అంటూ హీరో నాని ఇంట్రో ఉంది. సూర్య గా హీరో నాని ఎంట్రీ బాగుంది. యాక్షన్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బ్రదర్ అని అంటూ ఎస్.జే. సూర్య చెప్పిన డైలాగ్ తో టీజర్ ముగిసింది.

 

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్  తో “సరిపోదా శనివారం” టీజర్!
Saripodhaa Sanivaram Movie

 

నాని చాలా కాలం తర్వాత యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. టీజర్ తో మూవీ పై ప్రేక్షకుల్లో , అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కి సంబందించిన రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేశారు. ఆగస్ట్ 29, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో వస్తున్న ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.