“గేమ్ చేంజర్” టీజర్ రిలీజ్ ఎప్పుడంటే ..!

“గేమ్ చేంజర్” టీజర్ రిలీజ్ ఎప్పుడంటే ..!
Cinema News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, అంజలి, ఎస్. జే. సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్ర ఖని, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ని ఈ ఏడాది థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

“గేమ్ చేంజర్” టీజర్ రిలీజ్ ఎప్పుడంటే ..!
Game Changer

ఈ మూవీ కి సంబందించిన ఎలాంటి అప్డేట్ కూడా రావడం లేదు. అయితే రామ్ చరణ్ పుట్టిన రోజు అయిన మార్చ్ 27 వ తేదీన ఈ మూవీ టీజర్ రిలీజ్ కానుంది అని టాక్. ఆరోజున మూవీ రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ లు సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ మూవీ కి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.