సుహస్ నెక్స్ట్ మూవీ కు ఇంట్రెస్టింగ్ టైటిల్!

Interesting title for Suhas next movie!
Interesting title for Suhas next movie!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ వరుస మూవీ లు చేస్తూ బిజీగా ఉన్నారు. చివరిసారిగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ లో కనిపించారు. ఇప్పటికే అమేజాన్ ప్రైమ్ వీడియో సుహస్ నటిస్తున్న వెబ్ సినిమా ఉప్పు కప్పు రంబు ను ప్రకటించడం జరిగింది. ఇందులో కీర్తి సురేష్ కీలక పాత్రలో కనిపించనుంది.

ఇప్పుడు సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం లో ఒక మూవీ ని చేస్తున్నారు. బలగం మూవీ ను నిర్మించిన హన్షిత రెడ్డి మరియు హర్షిత్ రెడ్డి లు నిర్మాతలు గా వ్యవహరిస్తున్న ఈ మూవీ టైటిల్ పై క్లారిటీ వచ్చింది. జనక ఐతే గనక అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది. మే 24, 2024 న థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ లో స్నగీర్థన విపిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.