వారి టార్చర్‌ కారణంగానే జబర్దస్త్‌ నుంచి అనసూయ తప్పుకుందా ?

వారి టార్చర్‌ కారణంగానే జబర్దస్త్‌ నుంచి అనసూయ తప్పుకుందా ?
latest News

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2013లో ప్రారంభమైన జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఈ షో ద్వారా స్టార్ రేంజ్ ని క్రియేట్ చేసుకున్నారు. జబర్దస్త్ లో అద్భుతంగా యాంకరింగ్ చేసి సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా అందుకుంది. ఇక ఈ అమ్మడు సినిమాలలో అద్భుతంగా నటించి మంచి క్రేజ్ ని తెచ్చుకుంది.

అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. ఇక జబర్దస్త్ లో అనసూయ పోట్టి పొట్టి బట్టలను ధరించి ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ అమ్మడుకి ఈ షో ద్వారా అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఇక గతేడాది అనసూయ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పింది. మూవీ లలో ఫుల్ బిజీగా ఉండడంతో చాలా కష్టంగానే జబర్దస్త్ నుంచి తప్పుకుంది. ఈ షో నుంచి అనసూయ మాత్రమే కాకుండా రోజా, నాగబాబు, కొంతమంది కమెడియన్స్ కూడా తప్పుకున్నారు.

వారి టార్చర్‌ కారణంగానే జబర్దస్త్‌ నుంచి అనసూయ తప్పుకుందా ?
Anashuya

దీంతో ఈ షోకి ఒకప్పుడు ఉన్నంత క్రేజ్ లేకుండా పోయింది. అయితే ఈ అమ్మడు తాజాగా జబర్దస్త్ మానేయడానికి గల కారణాలను మరోసారి వెల్లడించింది. జబర్దస్త్ లో నటిస్తే నన్ను కేవలం యాంకర్ గానే చూస్తూ ఉన్నారు … నటిగా ఎవరు గుర్తించడం లేదు… అందుకే జబర్దస్త్ నుంచి తప్పుకున్నాను కానీ జబర్దస్త్ షో మాత్రం ఎప్పటికీ నా ఫేవరెట్ అని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా కొంతమంది చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, బాడీ షేమింగ్ చేయడంతో జబర్దస్త్ నుంచి తప్పుకున్నానని షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ.