ఆపరేషన్ వాలెంటైన్: ఆ విషయంలో సారి చెప్పిన నాగబాబు!

Operation Valentine: Nagababu said about that!
Operation Valentine: Nagababu said about that!

టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం హడా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఈ మూవీ మార్చ్ 1, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కు రెడీ అయిపోయింది. మానుషి చిల్లర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. వీటిపై మరోసారి సోషల్ మీడియా వేదిక గా మరో పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ లో “ఇటీవల జరిగిన వరుణ్ బాబు ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్‌ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను,ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను, ఎవరైన ఆ మాటలకి నొచ్చుకునుంటే I’m Really Very sorry. అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని Wanted గా అన్న మాటలు మాత్రం కాదు. అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను” అని అంటూ చెప్పుకొచ్చారు.

ఈ మూవీ లో నవదీప్, రుహాని శర్మ, మీర్ సర్వర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Operation Valentine: Nagababu said about that!
Operation Valentine: Nagababu said about that!