టీవీ పార్టనర్ ని ఫిక్స్ చేసుకున్న ఆపరేషన్ వాలెంటైన్?

టీవీ పార్టనర్ ని ఫిక్స్ చేసుకున్న ఆపరేషన్ వాలెంటైన్?
Cinema News

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో, శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిన ఏరియల్ యాక్షన్ డ్రామా ఆపరేషన్ వాలెంటైన్‌. మానుషి చిల్లర్ మహిళా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మార్చి 1, 2024న తెలుగు మరియు హిందీలో వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ మూవీ ఇటీవలే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ని నిర్వహించింది, ఈ వేడుకకు పద్మవిభూషణ్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

టీవీ పార్టనర్ ని  ఫిక్స్ చేసుకున్న ఆపరేషన్ వాలెంటైన్?
Operation Valentine

ప్రముఖ టెలివిజన్ ఛానెల్ అయిన జెమినీ టీవీ ఈ మూవీ కి సంబందించిన శాటిలైట్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వరుణ్ తేజ్ ఈ మూవీ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. నవదీప్, రుహాని శర్మ, మీర్ సర్వర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.