ఓటిటి లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన ‘రవితేజ’ ఈగిల్..!

'Ravi Teja' Eagle, which has come to streaming in OTT..!
'Ravi Teja' Eagle, which has come to streaming in OTT..!

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ యాక్షన్ స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ సినిమా ఈగిల్. ఈ సినిమా లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, అజయ్ ఘోష్ నటించారు. ఇటీవల థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈగిల్ సినిమా మంచి విజయం అందుకుంది.

'Ravi Teja' Eagle, which has come to streaming in OTT..!
‘Ravi Teja’ Eagle, which has come to streaming in OTT..!

కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ని పీఫుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించింది. విషయం ఏమిటంటే, కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ప్రముఖ ఓటిటి మాధ్యమాలు అమెజాన్ ప్రైమ్, ఈటివి విన్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ సినిమా ఓటిటి ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.