నాని కోసం ఆరుగురు.. అంతమంది ఎందుకు బాసు…?

Maruthi About New Movie With Nani

నాచురల్ స్టార్ నాని దేవదాస్ చిత్రం పరాజయం అయినా స్పీడ్ ను తగ్గించలేదు. నాని చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి, ప్రస్తుతం నాని గౌతమ్ దర్శకత్వంలో జెర్సీ అనే విభిన్న తరహా సినిమా చేస్తున్నాడు. నాని ఈ చిత్రంలో ఓ క్రికెట్ ప్లేయర్ గా కనిపించనున్నాడు. ఈ నేపద్యంలోనే నాని మరో డైరక్టర్ విక్రం కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తాడన్న సంగతి తెలిందే. విక్రం కె కుమార్ ఇంతకు ముందు మనం, 24 వంటి విభిన్నమైన చిత్రాలను రూపొందించాడు. ఇప్పుడు మరో విభిన్నమైన కథతో వస్తున్నాడు. ఆల్రెడీ నాని, విక్రం కె కుమార్ ల సినిమా ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Nani

సమాజంలో ఆడవారిపైన జరిగే ఆకృత్యాలను స్టోరి లైన్ గా తీసుకోని కథను రూపొందించాడు. ఈ చిత్రం ఏప్రిల్ నుండి సెట్స్ పైకి వెళ్లనున్నది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురుంచి ఓ లేటెస్ట్ అప్డేట్ వినబడుతుంది. ఈ చిత్రంలో ఆరుగురు హీరోయిన్స్ నటిస్తారు. ఒక్కరి తోనే నాని రొమాన్స్ చేస్తాడు అంటున్నారు. ఆరుగురు హీరోయిన్స్ ఎవ్వరు అనేది ఇంకా తెలియరాలేదు. త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి అంటున్నారు. ఆరుగురు హీరోయిన్స్ నటిస్తుండటంతో సినిమాకి మంచి హైప్ వస్తుందనే చెప్పాలి. ఈ చిత్రం మెయిన్ స్టోరీ ఆడవారిపై జరిగే అకృత్యాలు చూపిస్తారు కావున ఆరుగురు హీరోయిన్స్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఇంకా ప్రధాన పాత్రలగురుంచి తెలుస్తాయి అంటున్నారు.