చరణ్ కోసం రాబోతున్న కే‌టి‌ఆర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వినయ విధేయ రామ ఈ చిత్రంను ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బోయపాటి మలిచాడు. ఈ చిత్రం నుండి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ మరియు టిజర్ ను ఇటివలే విడుదల చేసిన సంగతి తెలిసిందే దీనికి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆధరణ లభించింది. ఓ ఐటమ్ సాంగ్ మినహా షూటింగ్ పుర్తవ్వుతుంది. ఈ ఐటమ్ సాంగ్ ను అన్నపూర్ణ స్టుడియోలో వేసిన పబ్ సెట్ లో రేపటి నుండి చిత్రీకరిస్తారు. బాలీవుడ్ హాట్ గర్ల్ ఇషా గుప్త చరణ్ తో ఆడబోతుంది. ఇకా ఈ చిత్రం నుండి ఓ లేటెస్ట్ అప్డేట్ ఒక్కటి వినబడుతుంది. అదే మెగా పవర్ స్టార్ వినయ విధేయ రామ ఆడియో వేడుక ఈ నెల 25 వ తేదిన కానీ 27 వ తేదిన కానీ జరుగుతుంది ఈ రెండు డేట్స్ లో ఎదో ఓ రోజు ఆడియో ఫంక్షన్ ఉంటుంది.

ఈ ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా రాజమౌళి, ఎన్టీఆర్ లు విచ్చేస్తారు. ఇంకో మెయిన్ గెస్ట్ గా కేటిఆర్ గారు విచ్చేస్తారు. రామ్ చరణ్ కి కేటిఆర్ కి దగ్గర సన్నిహిత సంబంధం ఉన్నది. ఇంకా రాజమౌళి, ఎన్టీఆర్ లు రావడానికి ముఖ్యకారణం. డివివి దానయ్య. ఎందుకంటే వినయ విధేయ రామ, ఆర్ ఆర్ ఆర్ నిర్మాత ఇద్దరు ఒక్కరే కావునా రాజమౌళి, ఎన్టీఆర్ లు వస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ చిత్రాని వచ్చే ఏడాది జనవరి 11 న సంక్రాంతి కి విడుదల చేస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నా ఈ చిత్రంలో కియర అద్వాని హీరొయిన్ గా నటిస్తుంది. ఇంకా ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు.