తండ్రి కొడుకులుగా నాని…!

Hero Nani To Play Dual Role In Jersey Movie

వరస పరాజయాలతో సతమత మవుతున్నా నాని తన తదుపరి చిత్రంగా గౌతం తిన్ననురి దర్శకత్వంలో జెర్సీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని ఓల్డ్ ఏజ్ క్రికెటర్ గా నటిస్తున్నాడు. క్రికెట్ నేపద్యంతో కూడిన చిత్రంగా రూపొందుతుంది. అందుకోసం నాని స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం నుండి ఇటివల విడుదలైన టిజర్ కు తెలుగు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్సు లభించింది. ఈ చిత్రం నుండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ సోషల్ మీడియాలో భాగా వైరల్ అవ్వుతుంది. నాని ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ అంటే తండ్రి కొడుకులు గా నటిస్తారని సమాచారం. అంటే తన తండ్రి గురుంచి కొడుకైన నాని చెబుతూ కథ మొదలుతుందని వార్తలు వస్తున్నాయి.

రంజీ నేపద్యమ్ తో కూడిన కథగా రూపొందుతుంది. రంజీ క్రికెటర్ గా నాని పడిన కష్టం అందులో ఉండే రాజకీయాలు అన్ని కూడా నాని జెర్సీ చిత్రంలో చూడవచ్చు. ఈ చిత్రంలో నాని ఆర్జున్ అనే క్రికెటర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని కన్నడ నటి శ్రద్ద శ్రీనాద్ తో రొమాన్స్ చేయ్యనున్నాడు. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క విజయంపైన నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అసలకే వరస పరాజయాలతో సతమతమవుతున్నా నానికి ఈ చిత్రం విజయం సాదించడం చాలా ఇంపార్టెంట్. ఈ చిత్రం తరువాత విక్రం కె కుమార్ తో ఓ సినిమాలో నటిస్తాడు. ఈ చిత్రంలో నాని విభ్నమైన ప్లే బాయ్ పాత్రలో నటిస్తాడు. విక్రం ఆ సినిమాను ప్రస్తుతం మహిళలపై జరిగే ఘోరాలను ఆ సినిమాలో చుపించానున్నాడు. ఆ చిత్రంలో నాని సరసన మేఘ ఆకాష్ కథానాయకగా నటిస్తుంది.