వ్యవసాయంకు సిద్దమవుతున్న నాని…!

New Director Kishore And Nani New Movie

విభిన్న కథలను ఎంపిక చేసుకుని, విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే నాని తాజాగా నాగార్జునతో కలిసి ‘దేవదాస్‌’ చిత్రంతో వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన దేవదాస్‌ సాదా సీదాగా సాగింది. అందుకే ఇకపై మల్టీస్టార్‌ల జోలికి వెళ్లవద్దని నాని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ‘దేవదాస్‌’ చిత్రం ఫ్లాప్‌ నుండి వెంటనే బయట పడ్డ నాని త్వరలోనే ‘జెర్సీ’ చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్దం అవుతున్నాడు. గౌతమ్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న జెర్సీ చిత్రంలో నాని క్రికెటర్‌గా మారి ఆట ఆడబోతున్నాడు. క్రికెట్‌ ముగిసిన తర్వాత నాని వ్యవసాయం చేస్తాడంటూ సమాచారం అందుతుంది.

nani-images

కొత్త కథలను కొత్త దర్శకులను ఎప్పుడు కూడా నమ్మి సినిమా చేసే నాని తాజాగా కిషోర్‌ అనే యువ దర్శకుడితో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. వచ్చే ఏడాది వేసవి నుండి చిత్రీకరణ ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో నాని రైతు పాత్ర పోషించబోతున్నాడట. దర్శకుడు కిషోర్‌ చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే నటించేందుకు ఓకే చెప్పాడట. ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటి వరకు నాని రైతు పాత్రలో కనిపించలేదు. మొదటిసారి నాని రైతుగా నటించేందుకు సిద్దం అవుతున్న నేపథ్యంలో ఇప్పటి నుండే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.

nani-pics