అక్కతో పెళ్లి చెల్లితో ప్రేమ…!

Police Constable Affair In Wife Sister

అతను శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసు కానిస్టేబుల్. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె చాలదు అన్నట్టు ఆపై ఆమె చెల్లెలి ముందు కూడా ప్రేమ పాఠాలు వల్లించాడు. తనను ప్రేమించాలంటూ వేధించాడు. బావ వేధింపులను భరించలేని ఆ మరదలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో కలకలం రేపింది. పోలీసులు వివరాల మేరకు, చిన్నగోపతి గ్రామానికి చెందిన లింగాల బిక్షంకు పెద్దకుమార్తె సుష్మ, చిన్న కుమార్తె అనూష ఉన్నారు. సుష్మను, అదే మండలంలోని సింగరాయపాలెం గ్రామానికి చెందిన అశోక్‌ అనే కానిస్టేబుల్ కు ఇచ్చి వివాహం జరిపించాడు.

suside
అయితే పెళ్లయిన తరవాత అశోక్ కన్ను అనూషపై పడింది. తనను ప్రేమించకుంటే తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్థానని బెదిరింపులకు దిగాడు. అత్తమామలు, గ్రామపెద్దలు ఈ విషయంలో అశోక్ ను హెచ్చరించినా, పద్దతి మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో అనూష పేరిట అశోక్ ఓ నకిలీ కోర్టు నోటీసులు తయారు చేయించి పంపాడు. అనూషపై కేసు నమోదైందని, కోర్టుకు హాజరుకాకుంటే అరెస్ట్ తప్పదని దానిలో చూసిన అనూష, తీవ్ర ఆందోళనతో మనస్తాపానికి గురై, ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అల్లుడి వేధింపులు తాళలేక తన చిన్న కుమార్తె ఆత్మహత్య చేసుకుందని లింగాల భిక్షం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు.

suside-conistable