పీకేకి జాక్ పాట్….పార్టీలో సెకండ్ పొజీషన్…!

Nitish Kumar Appoints Prashant Kishor JDU As Vice President

ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్‌‌ తాజాగా తాను స్థాపించిన ఎన్నికల సర్వే కంపెనీ అయిన ఐపాక్ నుండి తప్పుకుని తన సొంత రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేడీయూలో చేరిన సాగతీ తెలిసిందే. అయితే ఆయన చేరి కొద్ది రోజులు అయినా కాక మునుపే ఆయనకు ఆ పార్టీలో సెకండ్ పొజీషన్ లభించింది. ఆయన్ను జేడీయూ ఉపాధ్యక్షుడిగా అధ్యక్ష్యుడు నితీశ్ కుమార్ నియమించారు. నితీశ్ నిర్ణయంతో పార్టీలో ప్రశాంత్ కిశోర్ రెండో శక్తివంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందనున్నారు.

nithesh-kumar

2014 ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. పార్టీ కి అయితే ఆయన దూరం అయ్యారు కానీ ఆయనకు నితీశ్ కుమార్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. పంజాబ్‌, యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికలకు వ్యూహరచన చేశారు. పంజాబ్‌లో ఆప్‌ను తోసిరాజని కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఉపకరించాయి. ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ టీం ఏపీలో వైఎస్ జగన్ కోసం పని చేస్తోంది.

voicee-precedent