రాజకీయాలకు చిరంజీవి గుడ్ బై…!

Chiranjeevi Goodbye To Politics

గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి ఇక రాజకీయాలని పూర్తిగా తప్పుకోనున్నారని తెలుస్తోంది. 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన ఆయన ఎన్నికల అనంతర పరిణామాల నేపథ్యంలో పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. బదులుగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కల్పించడంతోపాటు పర్యాటక మంత్రిని చేసింది. కానీ తెలంగాణ ఏర్పాటుతో ఏపీలో ఆ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. ప్రజల్లో ఆ పార్టీ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నాటి నుంచి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఆయన కలవలేదు.

praja-rajyam
ఏఐసీసీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పినా చిరు నో చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఖైదీ నంబర్ 150 చిత్రంతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన రానున్న సంక్రాంతికి ‘సైరా’తో భారీ హిట్ కొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున పార్టీలో తిరిగి యాక్టివ్‌గా మారాలని చిరంజీవిని రాహుల్‌ గాంధీ కోరారని సమాచారం. దీనికి ఆయన స్పందించలేదని టాక్. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారని అర్థమైంది. అంతే కాకుండా ఈ మధ్యే చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగిసింది. కానీ ఆయన దాన్ని పునరుద్ధరించుకోలేదు. ఈ విషయాలు అన్నీ పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ఇదంతా ఆయన రాజకీయలకు దూరం కావడానికే ఇవన్నీ చేస్తున్నారని అంటున్నారు.

chiranjeevi