మెగా ట్రిబ్యూట్ ని గట్టిగానే ప్లాన్ చేసిన తేజ సజ్జ!

Teja Sajja has planned a mega tribute!
Teja Sajja has planned a mega tribute!

ఈ ఏడాది చిన్న మూవీ గా సంక్రాంతి బరిలో రిలీజై, బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ హను మాన్(Hanu man). టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో యంగ్ హీరో తేజ సజ్జ లీడ్ రోల్ లో నటించి, ఆడియెన్స్ ని మెప్పించారు. మెగాస్టార్ చిరంజీవి, హను మాన్ ప్రి రిలీజ్ వేడుక కి వచ్చి,మూవీ కి తన సపోర్ట్ ను అందించారు. అంతేకాక కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ను పద్మ విభూషణ్ (padma Vibhushan) అవార్డ్ తో సత్కరించిన సంగతి మన అందరికీ తెలిసిందే.

Teja Sajja has planned a mega tribute!
Teja Sajja has planned a mega tribute!

ఈ మేరకు మెగాస్టార్ కు మెగా ట్రిబ్యూట్ ను అందించేందుకు తేజ సజ్జ సిద్ధమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి పాటలకు తను అద్దిరిపోయే డాన్స్ ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేడు జరిగే సన్మాన కార్యక్రమం లో తేజ సజ్జ ఈ డాన్స్ పర్ఫామ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు .