బోయపాటి, బాలకృష్ణ ఎప్పుడంటే…!

Will Boyapati Srinu Change His Attitude For Balakrishna Movie

బోయపాటి శ్రీను వినయ విధేయ రామ చిత్రంతో నిరాశ పరిచిన సినిమా మాత్రం కలెక్షన్స్ పరంగా దూసుకేల్లుతుంది. ఈ చిత్రం తరువాత బోయపాటి బాలకృష్ణతో ఓ సినిమా ఉంటుందని ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్ రోజు అనౌన్స్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సింహా, లెజెండ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను సృష్టించాయి. ఆ తరువాత మరో సినిమాగా హట్రిక్ కోసం సిద్దం అవ్వుతున్నారు. బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ కథానాయకుడు నిరాశ పరిచిన కానీ, ఎన్టీఆర్ మహానాయకుడు పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ చిత్రం ఫిబ్రవరి 7 న విడుదలవుతుంది. ఈ చిత్రం తరువాత బోయపాటి సినిమాలో బాలకృష్ణ నటించనున్నాడు.

బోయపాటి కూడా స్క్రిప్ట్ వర్క్ సిద్దం చేసుకుని బాలకృష్ణ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రంను ఫిబ్రవరి లో లాంచ్ చెయ్యవచ్చు అనే టాక్ వినిపిస్తున్నా, ఏప్రిల్ లో సినిమా సెట్స్ పైకి వేల్లుతుందని సమాచారం. వినయ విధేయ రామ చిత్రంతో నిరాశ పరిచిన తన సినిమాలకు సరిగ్గా సరిపోయే హీరో బాలకృష్ణ తో హిట్ట్ కొట్టి మరల తన ట్రాక్ ను దక్కించుకోవాలని గట్టి ప్రయత్నంలో ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాను బాలకృష్ణ నిర్మాత గా ఎన్బికే ప్రొడక్షన్ పై బాలకృష్ణ నిర్మిస్తాడు. బోయపాటి, బాలకృష్ణ కు సరిపోయే ప్రతినాయకుడు అండ్ కథానాయక కోసం అన్వేషణలో ఉన్నాడు. త్వరలోనే ఆ సినిమాలో నటించే ప్రధాన పాత్రలపై ఓ అధికారిక ప్రకటన వేలువడనున్నది.