అనసూయ కీలక పాత్ర…!

Anchor Anasuya As MLA In Yatra Movie

యాంకర్ గా తన కెరీర్ ను స్టార్ చేసి బుల్లి తెరపై మంచి పేరు సంపాదించుకుని, ఆ తరువాత చిన్న చిన్న గా సినిమాలో నటిస్తూ వస్తున్నా అనసూయ, క్షణం, రంగస్థలం సినిమాల విజయంతో ఆమె ఫేట్ మారిపోయింది. ఆమె అందం, అభినయంతో సినిమాలో కీలక పాత్రలు చేస్తుంది. అప్పుడప్పుడు సినిమాలో ఐటమ్స్ సాంగ్స్ కూడా చేస్తూ వస్తుంది. తాజాగా ఆమె మహి వి. రాఘవ్ దర్శకత్వంలో మలయాళం మెగా స్టార్ మమ్ముటి ముఖ్య పాత్రలో యాత్ర అనే బయోపిక్ తెరకెక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ రాజశేకర్ రెడ్డి గారి జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంలో జగపతి బాబు రాజారెడ్డి పాత్రలో నటిస్తుండగా అనసూయ మాత్రం కర్నూల్ MLA గౌరు చరిత పాత్రలో నటిస్తుంది. గౌరు చరిత గారు కర్నూల్ నియోజక అభివృద్ధి కొరకు ఏవిధంగా పాటు పడింది ఆమె ప్రజలకు ఏ విధంగా సహాయం చేసింది. కాంగ్రెస్ పార్టీలో కీలక అభ్యర్దిగా ఏవిధంగా ఎదిగారు, రాజశేకర్ రెడ్డి గారి తో పాదయాత్రలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ లీడర్ కు అండగా నిలిచారు అనే అంశాలు యాత్ర బయోపిక్ లో గౌరీ చరిత పాత్రలో అనసూయను చూస్తారు అంటున్నారు. ఈ చిత్రాని 70 mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్ల శశి దేవి రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాని వచ్చే ఎడాది ఫిబ్రవరి 8న తెలుగు, మలయాళం భాషలో విడుదల చేస్తున్నారు.