ఇష్టం లేదు కానీ…!

Vidya Balan Will Do A Special Role In Ajith Tamil Remake Of Pink Movie

బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రం ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించగా, అయన భార్య బసవతారకం పాత్రలో విద్య బాలన్ నటించారు. ఆమె నటనకు తెలుగు రాష్ట్ర ప్రజలు నుండి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా విజయంతో సౌత్ సినిమా ఇండస్ట్రి పైన ఆమె దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె తాజాగా పింక్ సినిమా రీమేక్ లో నటిస్తుంది. నిజానికి ఓ ఇంటర్వ్యూ లో విద్య బాలన్ మాట్లాడుతూ…. నాకు రీమేక్ సినిమాలో నటించడం ఇష్టం లేదు కానీ, తమిళంలో రీమేక్ అవ్వుతున్నా పింక్ చిత్రం యొక్క నిర్మాత బోనికపూర్ కి మా ఫ్యామిలీ కి చాలా మంచి సంభంధాలు ఉన్నాయి. అందుకే బోనిజీ మాట కాదనలేక పింక్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించడానికి అంగీకరించాను అన్నారు.

ఈ చిత్రంలో తమిళ స్టార్ తల అజిత్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఫిభ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనున్నది. ఈ చిత్రాని కార్తి నటించిన ఖాకి మూవీ ఫేం వినోద్ పింక్ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత మరో బయోపిక్ లో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ లో నటించనున్నట్లు సమాచారం. సౌత్ సినిమా లపై విద్యాబాలన్ చాలా గట్టిగానే దృష్టి పెట్టినట్లుంది. విద్య బాలన్ ఇప్పటివరకు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అండ్ తన పాత్రకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలే చేస్తూ వస్తుంది.