కళ్యాణ్ రామ్ మళ్ళీ గ్రీన్ సిగ్నల్…?

Kalyan Ram 118 Movie Release On March 1st

వరస పరాజయాలతో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కె.వి. గుహన్ దర్శకత్వంలో 118 అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం సస్పెన్సు త్రిలర్ గా రూపొందుతుంది. ఈ చిత్రం ఇప్పటికే సగం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. మర్చి 1న ఈ చిత్రాన్ని విడుదల చేయ్యనున్నాడు. ఈ చిత్రంపై కళ్యాణ్ రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ నేపద్యంలోనే ఉయ్యలా జంపాల, మజ్ను వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు విరంచి వర్మ కళ్యాణ్ రామ్ కి ఓ కథను చెప్పి ఒప్పించినట్లు సమాచారం. మజ్ను చిత్రం తరువాత చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు.

తాజాగా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఓ కథను కళ్యాణ్ రామ్ కోసం సిద్దం చేసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం వేసవిలో సెట్స్ పైకి వెళ్లనున్నది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రాని నిర్మిస్తారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్నా 118 చిత్రం షూటింగ్ పూర్తైన తరువాతనే ఈ చిత్రం స్టార్ట్ అవ్వుతుంది. చిత్రబృంధం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనిలో ఉన్నది. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు విభినమైన కథలను చేస్తూ వస్తున్నాడు. అలాంటిదే మరో రెండు విభినమైన సినిమాలతో మన ముందుకు వస్తున్నాడు. 118 చిత్రం యొక్క టైటిల్ తో ఆకట్టుకున్నా కళ్యాణ్ రామ్, ఈ సారి మరే మ్యాజిక్ చెయ్య బోతున్నాడో చూడాలి మరి.