అక్కడ ఎఫ్2 రికార్డు…!

F2 Movie Record Collections

అనిల్ రావిపూడి దర్శకత్వంలో, వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టి స్టారర్ చిత్రం ఎఫ్2. ఈ చిత్రంలో మేహ్రిన్, తమన్నా కథనయకిలుగా నటిస్తున్నారు. అనిల్ ఈ చిత్రాని ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరక్కేకించాడు. ఈ చిత్రం ఈ నెల 12 న విడుదలై మంచి టాక్ ను సంపాదించుకుని విడుదలైన అన్ని చోట్ల సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వుతుంది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా అన్ని చోట్ల మంచి వసూళ్లను సాదించి పెడుతుంది. కాకినాడ లో ఈ చిత్రం తొలి వారంలో సాదించిన షేర్ విషయంలో అక్కడ నాల్గోవ స్థానంలో నిలిచింది.

మొదటి రెండు స్తానంలో బాహుబలి, బాహుబలి 2 సినిమా ఉండగా మూడోవ స్తానంలో చిరంజీవి నటించిన ఖైది నెంబర్ 150వ చిత్రం నిలవగా ఆ తరువాత నాల్గోవ స్తానంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 నిలిచింది. ఇంతకుముందు నాల్గోవ స్థానంలో మహేష్ భరత్ అనే నేను, చరణ్ రంగస్థలం, శ్రీమంతుడు, జనత గ్యారేజ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని అధిగమించి వాటి స్థానంలో ఎఫ్2 సినిమా నిలవడం విశేషం. ఎఫ్2 చిత్రం తరువాత అనిల్ రావిపూడి బాలకృష్ణ తో ఓ సినిమా తియ్యనున్నాడు. ఈ చిత్రం వేసవిలో సెట్స్ పైకి వెళ్ళుతుంది.