మహర్షి కథ ఇదే…!

Is This The Story Of Mahesh Maharshi Movie

భరత్ అనే నేను సినిమాతో మంచి విజయాని దక్కించుకున్నా మహేష్ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయకగా నటిస్తుంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మొదట డెహ్రాడూన్ లో మొదటి షెడ్యూల్ ను జరుపుకుంది. అక్కడ నుండి తరువాత షెడ్యూల్ ను అమెరికాలో జరుపుకుంది. అక్కడినుండి ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జరుగుతుంది. అమెరికా షెడ్యూల్ కంటే ముందు మహేష్ బాబు కాలేజీ కుర్రాడి లాగా నటిస్తున్నాడు. అమెరికా షెడ్యూల్ లో మహేష్ బాబు ఓ బడా కంపెనీ కి సి.ఈ.ఓ గా నటిస్తున్నాడు.

హైదరాబాద్ షెడ్యూల్ లో మహేష్ బాబు రైతు గా నటిస్తాడు. మహేష్ తమ్ముడి గా అల్లరి నరేష్ నటిస్తున్నాడు. ఇండియాలోని విల్లైజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశంలో ఇక్కడ కొన్ని పరిస్థితులు తలెత్తడం వలన మహేష్ ఇండియా కి వచ్చి తమ్ముడు అల్లరి నరేష్ కి అండగా నిలుస్తాడని సోషల్ మీడియాలో ఓ కథనం మొదలువుతుంది. ఇదే నేపద్యంలో కాస్త డిఫరెంట్ గా వచ్చిన శ్రీమంతుడు సినిమా మంచి విజయాని సాదించి పెట్టింది. మరల మహేష్ రొటీన్ ఫార్ముల ను ఫాలో అవ్వుతునట్లు సమాచారం. మహేష్ పల్లెటూర్ నేపద్యంలో వచ్చే సిన్స్ అమెరికా బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలకంటే హై లైట్ గా నిలుస్తాయి అంటున్నారు. కాకపోతే సోషల్ మీడియాలో వచ్చే కథలను నమ్మ వద్దని చిత్ర బృందం చెబుతుంది. ఈ చిత్రం విజయంపై మహేష్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.