జెర్సీ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేసిన నాని

Jersey Movie Release Date Announced In Nani

ఈ మధ్య రొటీన్ సినిమాలు చేస్తూ, మూస హీరో అంటూ తెలుగు సినీప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి విమర్శకులు ఎదుర్కున్న నాని తన పంథా మార్చి విభిన్నమైన కథాంశంని ఎన్నుకుని చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమా ‘జెర్సీ’. ఈ సినిమాలో నాని సరసన కన్నడ నటి శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. మళ్ళీ రావా సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని తొలిసినిమాతోనే పొందిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన రెండో సినిమాగా స్పోర్ట్స్ డ్రామా కథతో నాని తీస్తున్నాడు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ పథకం పైన నిర్మిస్తున్నారు.

Nani

ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 146 రోజులే ఉందంటూ, ఏప్రిల్ 19 2019 ని రిలీజ్ డేట్ గా తన ట్విట్టర్ పేజీలో నాని ప్రకటించాడు. కృష్ణార్జున యుద్ధం సినిమాతో అభిమానులను నిరాశపరిచిన నాని, తన గత చిత్రం దేవదాస్ తో నవ్వించినప్పటికీ సరైన విజయాన్ని మాత్రం సాధించలేకపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి, రొటీన్ సినిమాల హీరో అని తనపైన ఉన్న పేరు ని చెరుపుకొని తీరాల్సిన పరిస్థితిలో ఉన్నాడు నాని. అందుకే ఈ సినిమాకి సంబంధించినవి అన్నీ విభిన్నంగా ఉండాలని కన్నడ నటి ని హీరోయిన్ గా తీసుకొని, అజ్ఞాతవాసి సినిమాకి అందించిన మ్యూజిక్ తో విమర్శలు ఎదుర్కొని, ఎన్టీఆర్ సినిమాకి కూడా సంగీత దర్శకుడు నువ్వే అని మాటిచ్చిన త్రివిక్రమ్ కూడా మాట తప్పి హ్యాండ్ ఇచ్చేసరికి, ఈసారి ఎలాగైనా తెలుగులో మంచి హిట్ ఆల్బం ఇచ్చితీరుతానని కసిమీదున్న అనిరుద్ రవిచందర్ ని సంగీత దర్శకుడిగా తీసుకొని, గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తూ వచ్చే వేసవిలో సినిమాని విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.