ఓటేసి సెల్ఫీ దిగితే ఇంకా అంతే సంగతి

election commission on selfie voters at polling

ఇప్పుడున్న యువత జేబుల్లో ఎన్ని పైసలు ఉన్నాయో తెలియదుగాని చేతిలో మాత్రం మంచి సెల్ఫీ లు తీసుకునేందుకు అనువైన విలువైన స్మార్ట్ ఫోన్లు అయితే ఉన్నాయి. అసలే ఇప్పుడు ఎక్కడ చూసిన, నేను ఇది చేశా, అలా చేశా, ఇది తిన్నా, అక్కడ తిరిగినా, ఇదిగో నా పిల్లి, అదిగో మా ఇంట్లో బల్లి అంటూ ఏదిపడితే అది సెల్ఫీ లు దిగి, షేర్ చేసుకోవడం ప్యాషన్ అయ్యింది. ఇలా ఎన్ని చేసినా అనేవాళ్ళు లేరు కదా అని, డిసెంబర్ 7 న జరగనున్న ఎన్నికల పోలింగ్ కి వెళ్లి, ఓటేశాక పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీ తీసుకొని “హే…ఇదిగో నేను ఓటేశా, ఇదిగో నా ఫస్ట్ ఓటు” అంటూ పోస్టులు పెట్టారో, ఉన్నఫళాన పోలింగ్ కేంద్రం నుండి బయటకి పంపించేయడమే కాకుండా, కఠిన చర్యలు కూడా తీసుకుంటాం అని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

ఓటేసి సెల్ఫీ దిగితే ఇంకా అంతే సంగతి - Telugu Bullet

ఇలా పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ తీసుకుంటే 49ఎం అనే నియమాన్ని ఉల్లంఘించడమే అని, ఎన్నికల నియమావళిలో 17ఏ ను కొత్తగా నమోదు చేశారు. దీని వలన, ఆ ఓటు వేసిన అభ్యర్థి యొక్క ఓటు ని కూడా ఓట్ల పరిగణలోకి తీసుకోకుండా పక్కన పడేస్తారు. ఏదేమైనా ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే. లేకుంటే ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు దిగుతూ చుట్టూ ఉన్నవాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్న దృశ్యాలు, పోలింగ్ కేంద్రాల్లో కూడా కనపడితే అంతగా బాగోదు కదా. కాబట్టి, సెల్ఫీ పిచ్చోళ్ళంతా పోలింగ్ కేంద్రాల దగ్గర కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదని ఎన్నికల కమిషన్ సూచిస్తుంది.