కొత్తమ్మాయితో మొదలు పెట్టిన నాని…!

Hero Nani New Movie Acting On Shraddha Srinath

నాని గత కొన్నాళ్లుగా వరుసగా చిత్రాలను చేస్తూ యమ బిజీగా దూసుకు పోతున్న విషయం తెల్సిందే. ఒక చిత్రం పూర్తి కాకుండానే మరో చిత్రాన్ని మొదలు పెడుతూ మూడు నాలుగు నెలలకు ఒక్క సినిమా చొప్పున విడుదల చేస్తూ వెళ్తున్నాడు. తాజాగా నాని దేవదాస్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. దేవదాస్‌లో నాగార్జునతో కలిసి నటించిన నాని పెద్దగా అలరించలేక పోయాడు. తాజాగా నాని ‘జెర్సీ’ కోసం సిద్దం అయ్యాడు. క్రికెట్‌ నేపథ్యంలో గౌతమ్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నేడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఆఫీస్‌లో లాంచనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాత రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు.

nani

‘జెర్సీ’ చిత్రంలో నానికి జోడీగా కన్నడ ముద్దుగుమ్మ శ్రద్దా శ్రీనాథ్‌ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ విషయంపై క్లారిటీ వచ్చేసింది. నానితో పాటు ‘జెర్సీ’ చిత్రం పూజా కార్యక్రమాల్లో ముద్దుగుమ్మ శ్రద్దా శ్రీనాథ్‌ కూడా పాల్గొనడంతో ఈ విషయం కన్ఫర్మ్‌ అయ్యింది. కన్నడంలో ‘యూటర్న్‌’ చిత్రంతో ఈమెకు స్టార్‌డం దక్కింది. అక్కడ ఎన్నో అవార్డులను మరియు రివార్డులను అందుకోవడంతో పాటు, ఆ తర్వాత ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించింది. సమంత యూటర్న్‌ను కన్నడంలో ఈమె చేసింది. ఇప్పుడు తెలుగులో శ్రద్దా శ్రీనాథ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో అంతా కూడా ఈమె వైపు చూస్తున్నారు.

nani-images