అంతరిక్షం టీజర్ వచ్చేసింది !

మెగా వారసుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా, ‘ఘాజి’(ఫస్ట్‌ సబ్‌మెరైన్‌ ఫిలిం) తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకుడిగా తెరకెక్కిన ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’. ఈ మూవీ టీజర్‌ను కొద్ది సేపటి క్రితం చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. హై టెక్నికల్‌ వాల్యూస్‌, హాలీవుడ్‌ నిపుణుల సారధ్యంలో యాక్షన్‌ సీన్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ మేళవింపుతో వస్తున్న ఈ సినిమా వరున్‌  కరియర్‌లో మరో కీలక చింత్రంగా మారనుంది. వరుణ్ తేజ్, అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న చిత్రం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందించగా, డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి‌ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకుంది. తెలుగులో పూర్తిస్థాయి ‘అంతరిక్షం’ నేపథ్యంలో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట చిత్ర నిర్మాతలు.