అంత‌రిక్షం 9000 KMPH మూవీ రివ్యూ…!

Antariksham 9000KMPH Movie Review

న‌టీన‌టులు: వ‌రుణ్ తేజ్, అదితిరావ్, లావ‌ణ్య త్రిపాఠి, స‌త్య‌దేవ్, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల
దర్శకుడు: స‌ంక‌ల్ప్ రెడ్డి
నిర్మాతలు: రాధాకృష్ణ జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి
సంగీతం: ప‌్ర‌శాంత్ విహారి
నిర్మాణ సంస్థ‌: ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్
సినిమాటోగ్ర‌ఫీ: జ‌్ఞాన‌శేఖ‌ర్ విఎస్ (బాబా)
ఎడిట‌ర్: కార్తిక్ శ్రీ‌నివాస్

antha-riksham-movie

మెగా హీరో వ‌రుణ్ తేజ్ మంచి జోష్‌లో ఉన్నాడు. ఫిదా, తొలిప్రేమ లాంటి రెండు వ‌రుస హిట్లు సాధించి లైన్లోకి వ‌చ్చాడు. అయితే తాజాగా వ‌రుణ్ తేజ్ అంత‌రిక్షం మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. దీంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తెలుగులో తొలిసారిగా ‘అంతరిక్షం’ నేపథ్యంలో రూపొందిన సినిమా కావడంతో అంద‌రికి ఈ సినిమాపై ఆస‌క్తి నెల‌కొంది. పైగా ఈ సినిమాకు ‘ఘాజీ’ ఫేం సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో శాతకర్ణి దర్శకుడు క్రిష్ నిర్మాతగా వ్యవహరించాడంతో సినిమాపై అంచ‌నాలు విప‌రీతంగా ఉన్నాయి. మ‌రి ఈ రోజే విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకునే ప్ర‌యత్నం చేద్దాం.

కధ :

varun-tej-movie
స్పేస్ సెంటర్ లో ఉన్న సైంటిస్ట్ లకు ఓ విషయం కంగారుపెడుతుంది. అదేమిటంటే…తాము ప్రవేశపెట్టిన శాటిలైట్ మిహిర దారి తప్పిందని… కక్ష్య వదిలిందని..దాంతో ప్రపంచంలో ఉన్న కమ్యునికేషన్ వ్యవస్దకు పెద్ద విఘాతం కలగబోతోందని తెలుస్తుంది. దాంతో దాన్ని స్పేస్ లోకి వెళ్లి కోడింగ్ సరిచేసి సెటిరైట్ చేసేదెవరు అని ఆలోచిస్తే వాళ్లకు తట్టిన ఒకే ఒక పేరు దేవ్ (వరుణ్ తేజ). దేవ్ తమ ఆఫీస్ లో ఉంటే వెంటనే పిలిచి ఆ పని అప్పచెప్పేవారు. కానీ అతను 5 ఏళ్ల క్రితమే పర్శనల్ కారణాలతో జాబ్ వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో.. తెలియాలి….ఈ పని చేయటానికి ఒప్పుకోవాలి. అందుకోసం మరో వ్యామోగామి రియా (ఆదిత్యా రావు హైదరీ) రంగంలో కి దిగుతుంది. అతన్ని పట్టుకుని ఒప్పిస్తుంది. అక్కడ నుంచి దేవ్ స్పేస్ లోకి వెళ్లి మిహరను ఎలా సెట్ చేసాడు. ఆ ప్రాసెస్ లో అతనికే ఏ సమస్యలు ఎదురయ్యాయి…అసలు అతను ఉద్యోగం వదిలేసి వెళ్లిపోవటానికి కారణం ఏమిటి…శాటిలైట్ ని సెట్ చేసాక..అతను ఏం చేసాడు..వెనక్కి వచ్చాడా ..లేక అతని మనస్సులో వేరే ఆలోచన ఉందా, సినిమాలో లావణ్య త్రిపాఠి పాత్ర ఏమిటో తెలియాలి అంటే సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ :

varun-tej-anthariksham

ఘాజీ సినిమాతో ఇండ‌స్ట్రీని త‌న‌వైపు తిప్పుకున్న సంక‌ల్ప్ రెడ్డి.మ‌రోసారి గ్రిప్పింగ్ క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే సినిమా క‌థ‌ను బలంగా రాసుకున్న సంక‌ల్ప్‌ రెడ్డి. దానిని తెర మీద చూపించ‌డంలో మాత్రం కాస్తా త‌డ‌బ‌డ్డాడ‌నే చెప్పాలి. ఘజీ మాదిరే టైం వేస్ట్ చేయకుండా నేరుగా కథలోకి వెళ్ళాడు దర్శకుడు. తొలి సీన్ నుంచే ఎదో చేస్తున్నారు అనిపించేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ వేగంగానే పూర్తి అయింది. కానీ కథలో ఆ వేగం కనిపించలేదు. స్పేస్ లోకి వెళ్లిన తర్వాత కథ అక్కడే ఆగిపోయింది. ముందుకు వెనక్కి వెళ్లలేక స్పేస్ లొనే ఆగిపోయింది కథ. దానికి తోడు అక్కడ వాళ్ళు మాట్లాడే భాష తెలుగు అయినా ఆస్ట్రోనట్ కోడ్స్ ప్రేక్షకులకు అర్థం కాకపోవడం మైనస్. కానీ దానికి వేరే ఆప్షన్ లేదు.. అక్కడ అదే మాట్లాడాలి. కథ చిన్నది కావడం అంతరిక్షంకు ప్రతికూలం.. ఎమోషనల్ సీన్స్ అంతగా వర్కవుట్ కాలేదు..వరుణ్ తేజ్ తన పాత్రకు న్యాయం చేశాడు.. మిగిలిన వాళ్ళు బాగా నటించారు..ఓవరాల్ గా అంతరిక్షం ప్రయత్నం బాగుంది.. కానీ…ఎదో వెలితి.

అద్బుతంగా ఫెరఫార్మెన్స్ చేసాడని చెప్పలేం కానీ ..ఇలాంటి సబ్జెక్టు ఎంచుకునే అతను సగం మార్కులు వేయించుకున్నారు. మిగతా సగం సినిమాలో అతి చెయ్యని నటనతో నిలబెట్టాడు. హీరోయిన్స్ పాత్రలు డిజైనింగ్ ఇంకా బాగా చేసి ఉండాల్సిందేమో అనిపించింది. అప్పటికీ ఆదిత్యారావు హైదరీ తన స్క్రీన్ ప్రెజన్స్ తో హైలెట్ అయ్యింది. లావణ్య ది చాలా చిన్న పాత్ర. దేవ్ టీంలోని ఇతర సభ్యులు చక్కగా నటించారు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు. ఇలాంటి సినిమాలకి విజువల్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం ప్రాణంగా నిలుస్తాయి. ఆ రెండు కూడా అంతరిక్షం లో బాగా కుదిరాయి. సినిమాటోగ్రఫర్ జ్ఙానశేఖర్ అద్భుతమైన విజువల్స్ అందించాడు. ‘అంతరిక్షం’ సెట్టింగ్ అదిరిపోయింది. నిజంగానే అంతరిక్షంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి అందించిన పాటలు ఫర్వాలేడు. ఐతే, నేపథ్య సంగీతం లో మేజిక్ కనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : ‘అంతరిక్షం’లో అంతంతే
తెలుగు బులెట్ రేటింగ్ : 2.25 / 5