ప్రభాస్ గెస్ట్ హౌస్ వ్యవహారం… హై కోర్ట్ ఉత్తర్వులు…!

High Court Status Quo Orders Over Prabhas Guest House Case

రాయదుర్గం పన్మక్త గ్రామంలో హీరో ప్రభాస్ కు ఓ గెస్ట్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే, ఈ గెస్ట్ హౌస్ ను ఇటివల రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం పై ప్రభాస్ హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. నేను ఈ స్థలాని చట్టబధంగా 2015లో బీ.వైష్ణవి రెడ్డి, ఉష, బొమ్మిరెడ్డి శశాంక్ ల వద్ద కొన్నాను. ఈ ఇంటిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్ పేర్కొన్నారు. నేను క్రమమం తప్పకుండా విధ్యుత్ అండ్ ఇంటి పన్నులను చేలిస్తున్నాను. అన్నారు దీంతో తన ఆస్తి పై రెవిన్యూ అధికారులు జోక్యం చేసుకోవద్దని ప్రభాస్ హై కోర్ట్ ను ఆశ్రయించారు.

ప్రభాస్ తరుపున లాయర్ వాదిస్తూ… ఎటువంటి వివాదాలు లేకపోయినా ఈ భూమిని క్రమబధికరణ కొరకు దరకాస్తు చేసుకున్నాం. అందుకోసం 1.05 కోట్లు కూడా చేలించామని తెలిపారు. ఈ దరకాస్తు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నది. రెవిన్యూ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకోవ్వద్దని హై కోర్ట్ కు సూచించాడు. తదుపరి విచారణను ఈ నెల 31 కి వాయిదా వేసింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ను కౌంటర్ దాకలుకు హై కోర్ట్ అనుమతించింది.