ఎన్టీఆర్ ఆడియో వేడుకకు సూపర్ స్టార్…?

Balayya Personally Invites Superstar

క్రిష్ దర్శకత్వంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రను ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆనాటి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, ఎన్టీఆర్,భార్య బసవతారక గారి పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు ఈ చిత్రం దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఈ రోజు హైదరాబాద్ లోని కన్వెన్షన్ హాల్ లో ఆడియో రిలీజ్ వేడుకను జరుపుకుంటుంది. ఈ చిత్రం దర్శకుడు ఆ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. ఇక బాలకృష్ణ ఈ ఆడియో వేడుకకు సూపర్ స్టార్ కృష్ణ ను అతిదిగా పిలవడానికి అతని ఇంటికి వెళ్ళాడు.

అక్కడ ఎన్టీఆర్ బయోపిక్ లో తను నటించిన గెటప్స్ ను సూపర్ స్టార్ కృష్ణ కు బాలకృష్ణ తన సెల్ లో ఉన్న పిక్స్ ను చూపించాడు. ఈ విషయాన్నీ సినియర్ నటుడు నరేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.ఎన్టీఆర్ గా బాలకృష్ణ గెటప్స్ చూసి కృష్ణ గారు చాలా సంతోషపడ్డారు. ఇది కచ్చితంగా తెలుగు సినిమా చరిత్రలోనే ఓ మైల్ స్టోన్ గా నిలుస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆనాడు ఎన్టీఆర్ గారు కృష్ణ పోటి పడి మరి సినిమాలు చేసేవారు. ఇప్పుడు అయన బయోపిక్ కి కృష్ణ గారు అతిధిగా రావడం నందమూరి అభిమానులో చాలా సంతోషం ను నింపే సమయం. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9 న కథానాయకుడు. ఫిబ్రవరి 7 న మహానాయకుడు విడుదలవుతాయి.