అబ్బాయి కోసం మెగా బ్రదర్స్‌

mega brothers guest for antariksham movie

మెగా హీరో వరుణ్‌, సంకల్ప్‌ రెడ్డి ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అంతరిక్షం’ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. అంతరిక్షం నేపథ్యంలో సాగే ఈ చిత్రంను దర్శకుడు క్రిష్‌ తన సన్నిహితులతో కలిసి ఫస్ట్‌ ఫ్రేమ్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అతిధి రావు హైదేరి నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకను డిసెంబర్‌ మొదటి వారం చివర్లో నిర్వహించాలని భావిస్తున్నాడు. అందుకోసం అప్పుడే ఏర్పాట్లు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు. మరో వైపు ప్రీ రిలీజ్‌ వేడుకకు అతిథులను ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

chiru and pawan and varun

వరుణ్‌ మూవీని ప్రమోషన్‌ కోసం మెగాస్టార్‌ చిరంజీవి మరియు పవన్‌ కళ్యాణ్‌ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి రాకతో అంతరిక్షం స్థాయి అమాంతం పెరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. వీరిద్దరి కోసం వీలుగా డేటును ఫిక్స్‌ చేయాలని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్లాన్‌ చేస్తున్నారు. విభిన్నమైన సినిమాలను ప్రోత్సహించడంతో పాటు, వరుణ్‌ను కూడా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో ఈ మెగా బ్రదర్స్‌ పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు రాని అంతరిక్షం నేపథ్యం మూవీని వరుణ్‌ చేస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్‌తో పాటు, సాదారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంతో వరుణ్‌ క్రేజ్‌ ఇంకా పెరుగుతుందని మెగా ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.