శ్రీశాంత్‌పై పవన్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు…!

Nikesha Patel Irked By Sreesanth Comments On Bigg Boss

టీం ఇండియా మాజీ బౌలర్‌ శ్రీశాంత్‌ ప్రస్తుతం హిందీ బిగ్‌ బాస్‌ సీజన్‌ 12లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. బిగ్‌బాస్‌ ఈ సీజన్‌కు ఆయనే ప్రత్యేక ఆకర్షణ అంటూ హిందీ ప్రేక్షకులు చెబుతున్నారు. శ్రీశాంత్‌ ఈసీజన్‌లో ఉంటాడు అనగానే అంతా కూడా ఈ షోవైపు ఆసక్తిగా చూశారు. అందరి అంచనాలకు తగ్గట్లుగా శ్రీశాంత్‌ ఇంట్లో ఎంటర్‌టైన్‌ చేస్తూ వస్తున్నాడు. తాజాగా తన భార్య భువనేశ్వరి గురించి మంచి విషయాలు చెప్పడంతో పాటు, తన భార్యతో ప్రేమ విషయాన్ని కూడా శ్రీశాంత్‌ చెప్పుకొచ్చాడు. శ్రీశాంత్‌ మరియు భువనేశ్వరిలు పెళ్లికి ముందు ఏడు సంవత్సరాలు ప్రేమించుకున్నాట. ఏడు సంవత్సరాల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్నామని శ్రీశాంత్‌ చెప్పాడు.

Sreesanth Comments On Bigg Boss

శ్రీశాంత్‌ వ్యాఖ్యలపై పవన్‌ కళ్యాణ్‌ ‘కొమురం పులి’ హీరోయిన్‌ నికీషా పటేల్‌ షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. శ్రీశాంత్‌ బిగ్‌ బాస్‌ హౌస్‌లో చెబుతున్నవన్నీ కూడా పచ్చి అబద్దాలు. భువనేశ్వరితో శ్రీశాంత్‌ ఏడేళ్ల ప్రేమ లేదు, ఏమీ లేదు. సంవత్సరంనర ముందు వరకు కూడా నాతో శ్రీశాంత్‌ డేటింగ్‌లో ఉన్నాడు. అలాంటప్పుడు శ్రీశాంత్‌ భువనేశ్వరితో ప్రేమలో ఎలా ఉన్నట్లు అంటూ నికీషా షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ప్రేక్షకుల సింపతీ మరియు బిగ్‌బాస్‌ ఇంటి సభ్యుల ఆధరణ కోసం శ్రీశాంత్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్నాళ్ల క్రితం శ్రీశాంత్‌, నికీషా పటేల్‌ల ప్రేమ వ్యవహారం నిజమే అంటూ మలయాళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు అంటున్నారు.

srishanth