దిల్‌రాజుకు షాకిచ్చిన నాని…!

Will Dil Raju Reach The Sentiment Again

వరుస హిట్లతో దూసుకుపోతున్న నాచురల్‌ స్టార్‌ నాని వరుస చిత్రాలతో చాలా బిజీ అయ్యారు. ప్రస్తుతం ‘జెర్సీ’ చిత్రం కోసం నాని చాలా కసరత్తులే చేస్తున్నారు అంతేకాకుండా కఠినమైన క్రికెట్‌ ప్రాక్టీసు చేస్తున్నాడు. ఫ్యామిలి చిత్రాలను నిర్మించి మంచి సక్సెస్‌లు అందుకున్న నిర్మాత దిల్‌రాజు తాజాగా ఒక ప్రాజెక్ట్‌ను నాని ముందు ఉంచాడు. తమిళంలో అక్టోబర్‌ 4న విడుదలై మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న ‘96’ చిత్రాన్ని దిల్‌రాజు రీమేక్‌ చేసే ఆలోచనలో పడ్డాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకున్న దిల్‌రాజు తాజాగా ఒక ప్రత్యేకమైన షోను నాని మరియు అల్లు అరవింద్‌ కోసం ఏర్పాటు చేశాడు. ఈ చిత్రం నానికి తెగ నచ్చింది.

dillraju-movies

ఈ చిత్రంలో హీరోది మధ్య వయస్సు పాత్ర, దాంతో నాని హీరోగా నటించడానికి అంత సముఖత చూపడం లేదు కానీ సహ నిర్మాతగా ఉంటానని దిల్‌రాజుకి షాకిచ్చాడు. దిల్‌రాజు మాత్రం నాని హీరోగా అయితే బాగుంటది అని భావిస్తున్నాడు కానీ ఆ పాత్ర నానికి అంతా సూట్‌ అవదు, యూత్‌ఫుల్‌గా ఉండే నాని ఆ పాత్రకు సరిపోనని అనుకుంటున్నాడు. పైగా ‘96’ చిత్రంలో నటించిన త్రిషనే కథానాయికగా ఎప్పుడో ఎంపిక చేశాడు. త్రిష హీరో పేరు చెప్పమని అడిగినా దిల్‌రాజు హీరోపై క్లారిటీ ఇవ్వలేదట. అయితే చివరకు నాని ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంటాడా? పైగా హీరోయిన్‌ త్రిష కాబట్టి ఈ చిత్రంలో హీరోగా నటిస్తాడా లేదా అనేది చూడాలి.

dilraju-nani