మరొకరితో వెళ్లిపోయిన భార్య…పిల్లల గొంతు కోసి చంపిన భర్త

Illicit Affair killed Two Children At Kurnool

మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. తనను, తమ పిల్లల్ని వదిలేసి మరో వ్యక్తితో తన భార్య లేచిపోవడంతో భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో తన ఇద్దరి పిల్లల్ని గొంతకోసి హతమార్చాడు. దారుణమైన ఈ ఘటన కర్నూలు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం కర్నూలు జిల్లా జూపాడు బంగ్లాకు చెందిన భానూజీరావుకి ఝాన్సీలక్ష్మీబాయితో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి లిఖిత (7), మధు (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, కొద్ది కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

husband fair on wife
మరో వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భానూజీరావు గొడవపడేవాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట పిల్లలు, భర్తను వదిలేసి మరో వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా కలతచెందిన భానూజీరావు నిద్రపోతున్న తన పిల్లలు నిఖిత, మధులను సోమవారం తెల్లవారుజామున గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంట్లోనే తాడుతో ఉరేసుకున్నాడు. అయితే తాడు తెగిపోవడంతో కింద పడిన భానూజీరావు, వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి లొంగిపోయాడు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు.