భార్య ఇల్లీగల్ అఫైర్…తాళం వేసి మరీ పట్టిచ్చిన కానిస్టేబుల్

Constable wife illegal affair exposed

ఈ మధ్య తెలంగాణా పోలీస్ విభాగాలు వివాహేతర బంధాల మకిలి పట్టి పోతున్నాయి. బయట సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వారే క్షణిక సుఖాల కోసం తప్పుడు సంబంధాలు పెట్టుకుని దొరికాక ఉద్యోగాలు సహా పరువు అన్నీ పోగొట్టుకుంటున్నారు. సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ భార్యతో తెలంగాణా రాష్ట్ర పోలీస్‌ విభాగంలో పనిచేసే ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఒకరు వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన ఇప్పుడు పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్‌ మండలం బూరుగుగడ్డ గ్రామానికి చెందిన కుక్కడపు వెంకటేశ్వర్లు సూర్యాపేటలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వరంగల్‌లో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆత్కూరి కొండాకి హుజుర్‌నగర్‌ మండలం బూరుగడ్డకు చెందిన యువతితో అతడికి 2016లో వివాహం జరిగింది.

కానీ వివాహానికి పూర్వమే ఆమెకు వెంకటేశ్వర్లుతో వివాహేతర సంబంధం ఉంది. ఉద్యోగరీత్యా కొండ.. వారంలో మూడు, నాలుగు రోజులు వరంగల్‌కు వెళ్లి వస్తుంటాడు దీంతో దాన్ని అదునుగా తీసుకుని వివాహం అనంతరం కూడా సంబంధం కొనసాగడం ఆమె భర్త దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో అతడు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా ఆమె ఇకపై తాను సక్రమంగా నడుచుకుంటానని తెలపడంతో పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో కాపురం పెట్టారు. ఇంకా వారు కలుస్తున్నరన్న అనుమానంతో ఫంక్షన్‌ పేరుతో తల్లిదండ్రులను మరోచోటుకు పంపిన కొండా తాను కూడా డ్యూటీకి వెళ్తున్నానని భార్యకు చెప్పి గుట్టుగా సమీపంలోనే కాపు కాశాడు. భర్త డ్యూటీకి వెళ్ళాడని భావించిన భార్య వెంకటేశ్వర్లుకు ఫోన్‌ చేసింది. అతను వచ్చి లోపలికి వేల్లాడన్నవిషయం తెసులుకుని బయట నుంచి తలుపు గడియ పెట్టి ఇరుగు పొరుగు వారిని పిలవడంతో పాటు పోలీసులకు సమాచారమందించాడు. దీనితో పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు తీసి వారిరువురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.